RRR MOVIE : ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ట్రైలర్ రిలీజ్ వాయిదా

-

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఫ్యాన్స్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేసింది చిత్ర బృందం. కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 3 న విడుదల కావాల్సిన ట్రైలర్ ను విడుదల వాయిదా వేసుకుంది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. త్వరలోనే ట్రైలర్ కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని స్పష్టం చేసింది చిత్ర బృందం. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ లో నిరాశ మిగిలింది. కాగా… ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా… ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు… టీజర్లు అందరినీ ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news