దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ ఆర్ఆర్ఆర్’. ఫ్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో ఈనెల 25న సినిమా విడుదల కానుంది. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తరువాత దర్శకధీరుడు డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా కావడంతో రికార్డ్ కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగానే ట్రిపుల్ ఆర్ టీం భారీగానే ప్రమోషన్స్ చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పర్యటిస్తున్నారు.
కలెక్షన్ల పరంగా… బాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసేందుకు ట్రిపుల్ ఆర్ సిద్ధం అవుతోంది. ఇప్పటికే నార్త్ ఆడియన్స్ ట్రిపుల్ ఆర్ సాంగ్స్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. దీంతో బాలీవుడ్ లో ఈసారి ట్రిపుల్ ఆర్ భారీ కలెక్షన్లను కొల్లగొట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో బాహుబలి పేరిట ఉన్న రికార్డులన్నీ బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ రికార్డ్ ను క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో పవన్ కళ్యాణ్ రికార్డ్ ను తారక్, చరణ్ అదిగమించారు. నైజాం ఏరియాలో భారీగా ఫాలోయింగ్ ఉన్న నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇటీవల భీమ్లా నాయక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 6.17 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. పవన్ కళ్యాణ్ తో పాటు రాణా కూడా నటిస్తుండటంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఇదిలా ఉండగా తాజాగా ట్రిపుల్ ఆర్ బీమ్లా నాయక్ రికార్డ్ ను అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో తిరగరాసింది. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే 6.42 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ను అందుకుంది. దాదాపుగా 633 షోలకు సంబంధించి కలెక్షన్లు ఉన్నట్లు సమాచారం. దీంతో తొలిరోజే పెద్ద ఎత్తున కలెక్షన్లు సాధించనుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే దాదాపుగా రూ.70 కోట్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల కన్నా ఎక్కువ బడ్జెట్ తో నిర్మాత డీవీవీ దానయ్య ఈసినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఎన్నిరోజుల్లో ట్రిపుల్ ఆర్ రూ.400 కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.