RRRSoulAnthem : ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. “ఆర్ఆర్ఆర్” నుంచి మాస్ ఆంథెమ్

-

ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ మూవీలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా… ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఆర్ఆర్‌ఆర్‌ మూడో సింగిల్‌ ముహుర్తం ఖరారు అయింది. #RRRSoulAnthem పేరుతోఓ దీనిని విడుదల చేయనుంది. జనని అంటూ సాగే ఈ థర్డ్‌ సింగిల్‌ ను నవంబర్‌ 26 వ తేదీన విడుదల చేయనుంది ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో ఎన్టీఆర్‌, చరణ్‌, అలాగే… అజయ్ దేవ్‌ గన్‌ ఉన్నారు.

ఇక ఈ పోస్టర్‌ విషయానికి వస్తే…. అజయ్‌ దేవ్‌ గన్‌ పవర్‌ ఫుల్‌ లుక్స్ లో కనిపిస్తున్నాడు. అటు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌… వీర తిలకం పెట్టుకుని… ఎదో సహాయం కోసం చూస్తున్నట్లు మనకు కనిపిస్తున్నాడు. ఇక జూనియర్‌ ఎన్‌టీఆర్‌ మాత్రం…. ముఖం నిండా గాయాలతో.. చాలా ఆవేశంతో కనిపించాడు. మొత్తానికి థర్డ్‌ సింగిల్‌… ఈ ముగ్గురు మధ్య సాగనున్నట్లు అర్థమౌవుతోంది. ఇక తాజాగా అప్డేట్‌ తో… ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news