బ్రేకింగ్‌: సైదాబాద్‌ నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు

సైదాబాద్‌ నిందితుడి పై రివార్డు ప్రకటించింది పోలీస్‌ శాఖ. ఈ సైదాబాద్‌ నిందితుడి పై ఏకంగా రూ. 10 లక్షల రివార్డు ను ప్రకటించారు పోలీసులు. ఆ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామంటూ ఓ ప్రకటన ను కూడా విడుదల చేశారు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ… సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి డబ్బులు ఇవ్వడం తో పాటు… వారి వివరాలను చాలా గోప్యం గా ఉంచుతామని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాము రివార్డు ప్రకటిస్తున్నామన్నారు. నిందితుడు రాజు వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని… అలాగే ఎ్తతు… సుమారు 5.9 అడుగులు ఉంటాడని చెప్పారు. నిందితుడి చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616366 మరియు 9490616627 అనే ఫోన్‌ నంబర్ల కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్‌ సీపీ తెలిపారు. ఇక ఇప్పటికే నిందితుడి ఆనవాళ్లు విడుదల చేశారు పోలీసులు.