ప్రస్తుతం ఏపీలో జంగారెడ్డి గూడెం మరణాలపైనే రాజకీయాలు నడుస్తున్నాయి. జంగారెడ్డి గూడెం మరణాలన్ని.. సాధారణ మరణాలని ఏపీ సర్కార్ చెబుతుంటే… అవి కల్తీ సారా వల్లే జరిగాయని ప్రతి పక్షాలు అంటున్నాయి. అయితే.. ఈ జంగారెడ్డి గూడెం సంఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు.
అసెంబ్లీ ఎదుట టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి నిరసన తెలిపామని… కల్తీ సారా మరణాలను ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 మంది చనిపోతే ప్రభుత్వం లో కనీస చలనం లేదని… జంగారెడ్డిగూడెం మరణాల పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు. మరణాలను తేలిగ్గా తీసుకుంటున్నారని…. సభలో చర్చకు అంగీకరించి బాధితులకు న్యాయం జరిగే వరకూ మా పోరాటం ఆగదని హెచ్చరించారు నారా లోకేష్. . జంగారెడ్డిగూడెంలో సారా మరణాలు అన్ని జగన్ హత్యలేనని ఫైర్ అయ్యారు.