కేంద్రం మన కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా ప్రయోజనాలను మనం పొందొచ్చు. అయితే కేంద్రం అందించే పథకాల్లో ఇన్సూరెన్స్ పథకాలు కూడా వున్నాయి. అందులో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ కింద రూ.2 లక్షల వరకు కూడా ప్రయోజనాన్ని పొందొచ్చు. మరి ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా రూ.2 లక్షల వరకు వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొకడ్ట్ కింద ఈ స్కీమ్ ని చెప్పచ్చు. ఇందులో చేరితే ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ వస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో పాలసీ దారుడు మరణిస్తే రెండు లక్షలు కుటుంబానికి వస్తుంది.
ఈ స్కీమ్ లో చేరాలంటే ఏడాదికి రూ.330 చెల్లిస్తే చాలు. ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.289, ఏజెంట్ కమిషన్ రూ.30, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు రూ.11 కలిసి ఉంటాయి. మీకు కనుక బ్యాంక్ లో ఖాతా ఉంటే ఆటో డెబిట్ ఫెసిలిటీ పెట్టచ్చు. ఇలా చేయడం వలన అకౌంట్ నుంచి సంవత్సరానికి ఒకసారి రూ.330 కట్ అవుతూ వస్తాయి.
ఈ స్కీమ్ లో చేరాలని అనుకుంటే డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్ళండి. జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ అమలులో ఉంటుంది. అంటే మీ అకౌంట్ నుంచి మే నెలలో రూ.330 కట్ అవుతాయి. పోస్టాపీస్ లో అకౌంట్ ఉంటే అలా అయినా సరే పథకంలో చేరచ్చు. ఇక ఈ పధకానికి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు దీనిలో చేరచ్చు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీ టర్మ్ ఏడాది. అందువల్ల మీరు ప్రతి ఏడాది రూ.330 కట్టాలి.