చౌక వడ్డీకే ఈ బ్యాంకుల నుండి రూ.5 లక్షల రుణం..!

-

లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అది కూడా మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పెర్సనల్ లోన్ పై వడ్డీ రేట్లు తక్కువకే వస్తున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… లోన్ ని తీసుకోవాలని అనుకునే వాళ్లకి ఇది మంచి విషయం. బ్యాంక్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.

money

అందుకే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంక్ లో లోన్ ని తీసుకోచ్చు. అయితే ఏ బ్యాంక్స్ ఎంత వడ్డీకి లోన్స్ ఇస్తున్నాయి అనేది చూస్తే.. ప్రస్తుతం అయితే యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్‌ లో తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్స్ వస్తున్నాయి. వడ్డీ రేట్ల విషయం లోకి వస్తే.. వడ్డీ రేటు 8.9 శాతం నుంచి స్టార్ట్ అవుతున్నాయి.

5 ఏళ్ల కాల పరిమితితో రూ.5 లక్షల రుణం తీసుకుంటే నెలకు రూ.10,355 ఈఎంఐ పడుతుంది. ఇది ఇలా ఉంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ లో వడ్డీ రేటు అయితే 8.95 శాతంగా వుంది. అదే విధంగా ఇండియన్ బ్యాంక్‌లో 9.05 శాతంగా, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో 9.45 శాతంగా, పంజాబ్ అంద్ సింద్‌లో 9.5 శాతంగా వుంది. పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు ఐడీబీఐ బ్యాంక్‌ లో 9.5 శాతంగా, ఎస్‌బీఐ లో 9.6 శాతంగా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 10 శాతంగా ఉన్నాయి.

అలానే హెచ్‌డీఎఫ్‌సీ లో 10.25 శాతం నుంచి మొదలు అవుతోంది. అలానే యస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.40 శాతంగా ఉంది. ఇక ఐసీఐసీఐ లో అయితే వడ్డీ రేటు 10.5 శాతంగా ఉంది. కెనరా బ్యాంక్‌లో అయితే 11.25 శాతం వడ్డీ చెల్లించాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version