ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం మొదలైన క్యాబినెట్ భేటీ దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది.ఈసీ కేబినెట్ భేటీకి అంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో కేవలం అత్యవసర అంశాలతో పాటు కీలకమైన విషయాలపై మాత్రమే చర్చించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఆధునీకరించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందుకు రూ.600 కోట్లను కేటాయిస్తామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలపై తను అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేసినట్లు మంత్రి చెప్పారు.ఇక, లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రాష్ట్ర విజభన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో.. దీనిపై డిస్కషన్ జరగలేదు.