ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త..చెప్పింది. తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు నిధులు రిలీజ్ చేసింది. ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.879.08 కోట్ల నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. 6వ వాయిదా కింద 879.08 కోట్ల రూపాయలు విడుదల చేసింది మోడి సర్కార్.
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్ల నిధులు విడుదల చేసింది కేంద్ర సర్కార్. ఇక దీనిపై జగన్ సర్కార్ హర్షం వ్యక్తం చేసింది. ఇక ఈ నెల మొదట్లో ఆంధ్ర రాష్ట్రానికి రూ. 948.35 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులను పంచాయితీల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుతో గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ, గోదావరి జిల్లాలోని కేపీ పురంలో ఈ పార్కు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.