స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాలి..

టెక్నాలజీ రాకెట్ కన్నా స్పీడ్ గా పెరుగుతుంది.. అరచేతిలోనే ప్రపంచంలోని విషయాలను తెలుసుకుంటున్నారు..ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం వల్ల గంటల తరబడి ఫోన్ ను చూస్తున్నారు. అలా చూడవద్దని నిపుణులు ఎంతగా చెప్పినా కూడా ఎవ్వరూ వినరు..అయితే ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు.కేవలం ఆరోగ్య సమస్యలు అంటే పోరపాటే మరో సమస్య కూడా ఉంది.అదే పేల సమస్య..

చాలామందికి తలలో పేలు పడి పెద్ద సమస్యగా మారుతుంది. ఈ పేలు అనేవి అన్ని వయసుల వారి తలలో ఏర్పడతాయి. ముఖ్యంగా స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది..తలలో పేలు పడితే తలంతా చికాకు పెడుతుంది. అంతేకాకుండా దురద బాగా వస్తుంది. అప్పట్లో అమ్మమ్మ, నాన్నమ్మలు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని తీరికగా పేలు తీసేవారు. కానీ ప్రస్తుతం జనరేషన్ బిజీ లైఫ్ స్టైల్ వలన పేలు తీసేవారు లేకుండా పోయారు. తలలో పేలు పడుతూ కొందరు రకరకాల ఆయిల్స్ వాడేస్తుంటారు..

పేలు పోవడం పక్కన పెడితే..కొత్త రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.పెద్దల కంటే పిల్లలకు ఈ సమస్య కాస్త ఎక్కువగా ఉంటుంది.. ఇకపోతే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూస్తే పేలు వస్తాయన్న విషయంపై నిపుణులు కొన్ని విషయాలను వెల్లడించారు. వాస్తవానికి స్మార్ట్ ఫోన్ ద్వారా పేలు వ్యాపించవు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసి సెల్ఫీలు తీసుకునేటప్పుడు, వీడియోలు, ఫోటోలు కలిసి చూసే సమయంలో వారి తలలు దగ్గరగా ఉంటాయి.

అప్పుడు ఒకరు జుట్టు మరొకరి జుట్టుకు తాకుతుంది.. దీంతో పేలు ఈజీగా ఎక్కుతాయి. కొత్త వ్యక్తిని తాకగానే పేలు వెంట్రుకలను పాకుతూ వెళ్ళిపోతాయి. వేరే వారి తలపైకి చేరి గుడ్లు పెట్టేస్తాయి. అలా తమ సంతతిని పెంచుకుంటూ పెద్ద సమస్యగా మారుతాయి. పేల సమస్య ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు..