సంవత్సరానికి రూ. 3.5 కోట్ల ప్యాకెజ్‌తో జాబ్.. బోర్‌ కొట్టిందని మానేసిన ఇంజనీర్..!

-

సంవత్సరానికి 20-30 లక్షల ప్యాకేజ్‌ వస్తేనా ఓ రేంజ్‌లో చూస్తారు. లైఫ్‌ సెట్‌ అనుకుంటారు..అలాంటిది ఓ ఇంజనీర్‌కు సంవత్సరానికి రూ. 3.5 కోట్ల జీతం. మాములు విషయం కాదు. అసలు అలాంటి జాబ్‌ వస్తే ఎవరైనా వదులుకుంటారా..? హ్యాపీగా జాయిన్‌ అయిపోతారు కదా..! కానీ ఆ ఇంజనీర్‌ మాత్రం జాబ్‌ బోర్‌ కొట్టిందని అంత ప్యాకెజ్‌ ఉన్నా వదిలేశాడు. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో పనిచేస్తున్న ఈ ఇంజనీర్ తన జాబ్‌పై విసుగెత్తి మానేశారని తెలియడంతో జనాలంతా నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు ఇతని రాజీనామా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఎందుకు మనోడు జాబ్‌ వదిలేశాడో చూద్దామా..!
మైఖేల్ లిన్ (Michael Lin) అనే ఇంజనీర్ 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన అమెజాన్‌లో పని చేసేవారు. అమెజాన్‌లో ఉద్యోగం మానేసి నెట్‌ఫ్లిక్స్‌లో చేరిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనే శాశ్వత ఉద్యోగిగా ఉండాలని అనుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ లిన్‌కి ఏడాదికి 450,000 (సుమారు రూ.3.5 కోట్లు) జీతం ఇచ్చింది. రోజూ ఉచితంగా ఆహారం కూడా ఉండేది.. వెకేషన్స్‌లో, అనారోగ్యంగా ఉన్నప్పుడు తీసుకునే సెలవు రోజుల్లో, ఇంకా ఇలా ఎన్ని లీవులు పెట్టినా నెట్‌ఫ్లిక్స్‌ వాటిని పెయిడ్ లీవ్స్‌గానే పరిగణించింది. ఇలా ఎక్కువ శాలరీ, అన్‌లిమిటెడ్ పెయిడ్ లీవ్స్ ఆఫ్స్‌ ఆఫర్ చేసే ఇలాంటి జాబ్ సంపాదించడం ప్రతి ఒక్కరికీ.. టెక్కీ బిగ్ డ్రీమ్ అని లిన్ కూడా లింక్డ్ఇన్‌లో చెప్పేవాడు. అలా చెప్పిన లిన్ 2021 మేలో జాబ్‌కు రాజీనామా చేసినప్పుడు అందరూ అతనికి పిచ్చెక్కింది అనుకున్నారు.
లిన్‌ తల్లిదండ్రులు మొదట అభ్యంతరం వ్యక్తం చేశారట. తన గురువు కూడా లిన్‌ నిర్ణయాన్ని ” అని లిన్ పేర్కొన్నారు. ఇలాంటి అభ్యంతరాలు ఎదురవడంతో కొద్దిరోజుల పాటు తన నిర్ణయాన్ని ఆయన పునఃపరిశీలించారు. మూడు రోజులపాటు ఆలోచించి చివరికి మేనేజర్‌తో తాను ఉద్యోగం మానేస్తున్నట్లు చెప్పారట. నెట్‌ఫ్లిక్స్‌లో జాబ్‌ చాలా బాగుండేదని.. తాను చాలా విషయాలు నేర్చుకున్నాని లిన్‌ చెప్తూనే… కొన్ని ఏళ్లలోనే ఉద్యోగంపై అతనికి విరక్తి పుట్టిందట.
కొవిడ్ తర్వాత సహోద్యోగులు, ప్రోత్సాహకాలు, మిగతా అన్ని అతనికి దూరం అయ్యాయి. చివరికి అతనికి మిగిలిందల్లా వర్క్ మాత్రమే. దీంతో అతను వర్క్‌ని ఎంజాయ్ చేయలేకపోయాడట. అప్పుడే ఉద్యోగం మానేసి కొత్త వర్క్ ఎంచుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. నెట్‌ఫ్లిక్స్‌లో రెండేళ్లు పనిచేశాక ప్రోడక్ట్-మేనేజర్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ ఆ జాబ్ అతనికి రాలేదు. అధిక శాలరీ లభిస్తున్నా కెరీర్‌లో ప్రోగ్రెస్ లేదనే అసంతృప్తి అతన్ని మరింత గందరగోళానికి గురిచేసింది. అలానే జాబ్‌పై బోర్ అనేది మరింత పెరుగుతూ వచ్చింది. తత్ఫలితంగా అతని పర్ఫార్మెన్స్ తగ్గింది. మరోవైపు సరిగా వర్క్ చేయాలంటూ నెట్‌ఫ్లిక్స్‌ అతనికి సూచించింది. ఇలాంటి పరిస్థితులలో ఇంకా ఎక్కువ కాలం ఉద్యోగం చేయడం తన వల్ల కాదని ఆయన జాబ్ మానేశారు.
ఈ నిర్ణయం తన కెరీర్, సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని లిన్ భయపడ్డాడట.. కానీ అలా జరగలేదని.. స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ఇతర వ్యవస్థాపకులు, రచయితలు, క్రియేటర్స్ వంటి ఎక్కువ మంది వ్యక్తులను కలుసుకోగలిగినట్లు లిన్‌ చెప్పుకొచ్చాడు.. ఇప్పుడు తాను చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉన్నానని లిన్ చెబుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఎనిమిది నెలలు అయ్యిందని.. ఇప్పుడు తమ కోసమే పూర్తిగా పనిచేయాలని నిర్ణయించుకున్నానని లిన్ తెలిపారు.
మనసు మాట ముందు.. ఎంతటి వ్యక్తులైనా, ఎంతటి విలువైన జాబ్‌ అయినా పనికిరాదని లిన్‌ ద్వారా మరోసారి నిరూపితమైంది. జీవితంలో నచ్చని పనిచేయడం కంటే నరకం ఇంకోటి ఉండదు. లైఫ్‌ను ఎంజాయ్‌ చేయకుండా.. ఎప్పుడూ వర్క్‌ మోడ్‌లో ఉంటే.. కొన్నాళ్లకు మీకు మీరే బోర్‌ కొడతారు. ఎంట్రా ఈ లైఫ్‌ అనే భావన వస్తుంది. తిరగాలి, ట్రావిలింగ్‌ చేయాలి. ఒకేచోట నెలల తరబడి అస్సలు ఉండొదండోయ్‌.!

Read more RELATED
Recommended to you

Latest news