వైరల్ వీడియో: ప్రారంభోత్సవం రోజే కుప్పకూలిక ఫుట్ బ్రిడ్జి.. 20 మందికిపైగా గాయాలు

-

అది ఒక అందమైన నగరం.. ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ప్రాంతం.. పర్యాటకులను ఆకర్షించేందుకు అధికారులు ఫుట్ బ్రిడ్జిని నిర్మించారు. ఒక వాగుపై ఆ వంతెనను నిర్మించారు. వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ మేరకు అధికారులు ఫుట్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో వంతెనను ప్రారంభించి.. అందరూ బ్రిడ్జిపై నడుస్తుండగా.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జిపై అధిక సంఖ్యలో మనుషులు రావడంతో వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పలువురు వాగులో పడ్డారు. వాగులో నీళ్లు లేకపోవడం.. కేవలం రాళ్లు ఉండటంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కూలిన బ్రిడ్జి
కూలిన బ్రిడ్జి

ఈ ఘటన మెక్సికో నగరంలోని క్యూర్నావాకా ప్రాంతంలో చోటు చేసుకుంది. వాణి మల్హోత్రా అనే మహిళ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ప్రారంభోత్సవ వేడుక రోజే ఫుట్ బ్రిడ్జి కూలినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 20 మందికిపైగా బ్రిడ్జిపై నుంచి కింద పడ్డారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై నగర మేయర్ జోస్ లూయిస్ ఉరియోస్టెగుయ్ మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ వేడుకలో తనతోపాటు వచ్చిన చాలా మంది వంతెనపై నడిచారన్నారు. బరువు ఎక్కువ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news