తమిళనాడులోని కోయంబత్తూర్ జూలో రస్సెల్స్ వైపర్ అనే జాతికి చెందిన ఓ పాము ఏకంగా 33 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ జాతికి చెందిన పాములు సహజంగానే సుమారుగా 40 నుంచి 60 పిల్లల వరకు జన్మనిస్తాయని జూ డైరెక్టర్ సెంథిల్ నాథన్ తెలిపారు. అయితే ఆ 33 పాము పిల్లల్లో అన్నింటినీ తాము పోషించలేమని, కనుక వాటిలో కొన్నింటిని అటవీశాఖ అధికారులకు ఇస్తామని, వారు వాటిని అడవుల్లో వదిలేస్తారని తెలిపారు.
కాగా గతంలో ఇదే జాతికి చెందిన పాము ఒకటి 60 పిల్లలకు జన్మనిచ్చిందని నాథన్ వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో కోయంబత్తూర్ శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంటి బాత్‌రూంలో రస్సెల్స్ వైపర్ జాతికి చెందిన ఓ పామును చూశాడు. దీంతో భయపడ్డ అతను అధికారులకు సమాచారం అందించాడు. వారు ఓ ప్రైవేటు స్నేక్ క్యాచర్ టీంతో దాన్ని పట్టుకున్నారు. అది అప్పుడు 35 పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం దాన్ని, దాని పిల్లలను సమీపంలోని అనైకట్టి అడవిలో వదిలేశారు.
Tamil Nadu: Russell's Viper gives birth to 33 snakelets at VOC Park Zoo in Coimbatore. The snakelets will be let into Anaikatti forest. pic.twitter.com/DJ2Rx8yV4z
— ANI (@ANI) August 8, 2020
అయితే తాజాగా ఇప్పుడు జూలో తిరిగి అదే జాతికి చెందిన పాము 33 పిల్లలకు జన్మనిచ్చింది. కాగా ఈ పాము అత్యంత ప్రమాదకరమైందని, వీటికి విషం బాగా ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.