బీజేపీ మాట: బాబుకో రూలు, జగన్ కో రూలా… వైఖరి స్పష్టం!!

-

ఏపీ రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశం అని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోదని ఇప్పటికే పలుమార్లు కేంద్రంలోని పెద్దలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఏపీ బీజేపీ దీ ఒక వైఖరి – కేంద్రంలోని బీజేపీ పెద్దలది మరొకవైఖరి అనే విమర్శలు వచ్చాయి. ఫలితంగా కన్నాను కాదని సోము వీర్రాజుకు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. దీంతో అమరావతి విషయంలో ఇప్పుడు బీజేపీ స్టాండ్ పై క్లారిటీ వస్తోంది! తాజాగా ఈ విషయాలపై బీజేపీ ఉపాధ్యాక్షుడు విష్ణువర్దన్‌ రెడ్డి స్పందించారు!

అమరావతి విషయంలో బీజేపీని దోషిగా చేయాలని తపనపడుతోన్న టీడీపీ నేతలకు తనదైన స్ట్రాంగ్ పంచ్ లు ఇవ్వడం మొదలుపెట్టిన విష్ణు… అమరావతితో సంబంధం లేకపోయినా బీజేపీని ముద్దాయి చేయాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయంటూ ఫైరయ్యారు. అనంతరం… గతంలో కర్నూల్‌ లో హైకోర్టు పెట్టమని బీజేపీ నేతలు చంద్రబాబును అడిగితే.. ఆయన మాత్రం అమరావతిలో పెట్టారని.. పెడరల్ స్ఫూర్తిని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అమరావతిలో హైకోర్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొందని.. నాడు మంచిదైన కెంద్ర ప్రభుత్వం నేడు దోషైపోయిందా అని విష్ణు ఫ్రైరయ్యారు!

ఈ సందర్భంగా… అంతా బాబే చేశారు అనే క్లారిటీ ప్రజలకు ఇచ్చే పనిలో భాగంగానో ఏమో కానీ… చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నాడు అమరావతిని ఎంపిక చేయలేదని గుర్తుచేస్తున్నారు విష్ణు. రాజధాని ఎక్కడ పెట్టాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని నమ్మే.. నాడు కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఆమోదించిందని చెబుతున్నారు. నాడు ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం అని నమ్మి అమరావతిని ఆమోదించామో.. నేడు మిగిలిన ప్రాంతాలకు కూడా రాజధానిని విస్తరించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నా కూడా అదేపద్దతిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని విష్ణు స్పష్టం చేశారు!

Read more RELATED
Recommended to you

Latest news