రష్యాలో ఘోరం… గని ప్రమాదంలో 52 మంది దుర్మరణం

-

రష్యాలో ఘోరం చోటు చేసుకుంది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలోని బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 52 మంది మరణించగా.. పెద్ద సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. కెమెరోవో ప్రాంతంలోని బొగ్గు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 52 మంది చనిపోయారు. ఆరుగురు సెక్యురిటీ అధికారులు కూడా ఈ ఘటనలో బలయ్యారు. ఐదేళ్లలో అత్యంత ఘోరమైన గని ప్రమాదంగా భావిస్తున్నారు రష్యన్ అధికారులు. ప్రమాదం జరిగిన సమయంలో 285 మంది భూగర్భంలో పని చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సానుభూతి తెలియజేశారు. బలమైన పేలుడు కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు.

గతంలో కూడా ఈ గనిలో ప్రమాదాలు సంభవించాయి. ఐదేళ్ల క్రితం జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదే అని అధికారులు చెబుతున్నారు. పేలుడు కారణంగా పొగ వ్యాపించడంతో.. ఊపిరి అందక ఎక్కువ మంది మైనర్లు ప్రాణాలను కోల్పోయారు. అయితే మిగతా వారిని రక్షించేందుకు సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు  38 మందిని ఆసుపత్రిలో చేర్చారని..వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news