రష్యా తన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ విపై కీలక ప్రకటన చేసింది. అమెరికా కంటే తమ కరోనా వ్యాక్సిన్ రేటు చాలా తక్కువ అని ప్రకటించింది. ఫైజర్ వ్యాక్సిన్ మరియు మోడరనా వ్యాక్సిన్ తో సహా అమెరికా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ల కంటే చౌకగా ఉంటుందని హామీ ఇచ్చింది. అధిక ధరకు అమెరికా వ్యాక్సిన్ విక్రయించడానికి చాలా కారణాలు ఉన్నాయని, వాళ్లకు నిల్వ కష్టం కానుంది అని అలాగే వాళ్లకు పంపిణీ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ధరకు అమ్ముతారని పేర్కొంది.
ఇక మొదట తమ టీకాలను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న రెండు అమెరికన్ వ్యాక్సిన్ తయారీదారులు… ఇప్పుడు వారి ధరలను కూడా చెప్తున్నారు. ఫైజర్ తన వ్యాక్సిన్ ధర 19.50 డాలర్లు ఉండవచ్చు అని చెప్పింది. మోడెర్నా 25-37 డాలర్ల మధ్య వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.