ఇండియాలో రష్యా విదేశాంగ మంత్రి పర్యటన… రెండు రోజులు పాటు కొనసాగనున్న టూర్

-

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ రోజు భారత పర్యటనకు రానున్నారు. గురువారం నుంచి రెండు రోజులు భారత్ లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభం అయిన తర్వాత ఇండియాకు రష్యా ఫారన్ మినిస్టర్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభం అయిన తర్వాత భారత్ తటస్థంగా ఉంది. ఐక్యరాజ్య సమితిలో పలు మార్లు రష్యాకు వ్యతిరేఖంగా తీర్మాణం చేసినా… భారత్ తటస్థంగా ఉంది. అమెరికా నుంచి ఒత్తడి ఉన్నా.. భారత్ రష్యా నుంచి చమురు, సన్ ఫ్లవర్ ఆయిల్ ను కొనుగోలు చేస్తూనే ఉంది. తాజాగా ఈరోజు సెర్గీ లావ్రోవ్ భారత పర్యటనకు రావడం… అనేక దశాబ్ధాలుగా ఉన్న భారత్ – రష్యా మైత్రి మరింతగా బలపడే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, సైనిక సంబంధాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న తరుణంలో భారత్ సాయాన్ని రష్యా కోరే అవకాశం ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news