రష్యాలో ఘోర విమాన ప్రమాదం..16 మంది దుర్మరణం

రష్యాలో ఘోర విమానం ప్రమాదం చోటు చేసుకుంది. రష్యాలోని తతర్ స్తాన్ ప్రాంతంలో విమానం కుప్పకూలిన ఘటనలో 16 మంది మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత శిథిలాల నుంచి 7గురు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. పారాశ్యూట్ జంపర్లతో వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానం తక్కువ రేంజ్ ప్రయాణాలకు వినియోగించే రెండు ఇంజన్లది. ఇటీవల కాలంలో రష్యాలో విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. 

విమానాల భద్రత కోసం రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగున్నాయని సంబంధిత అధికారులు అంటున్నారు. గత నెలలో కూడా రష్యాలో ఇలాగే  విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గత జులైలో కూడా చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో 28 మంది మరణించారు.