ఈటల రాజేందర్..ఆ వీడియోలు బయటపెడతా : హరీష్ రావు వార్నింగ్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మరో సారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. ఐదు నెలల కింద బిజెపి పార్టీ నీ విమర్శించిన ఈటల రాజేందర్ వీడియో లు బయటికి తీస్తానని హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా ఇవాళ జమ్మికుంట లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తాము హుజూరాబాద్ వచ్చి అభివృద్ది చేస్తున్నామని.. కేంద్ర మంత్రులు ఖాళీ చేతులతో వచ్చి.. వెళుతున్నారని మండిపడ్డారు.

బిసి ల జనగణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి సిఎం కేసీఅర్ పంపాడని…కష్టపడి పని చేసిన నాయకులనే కాపాడుకోలేని బిజెపి… ఈటల రాజేందర్ ప్రజలను ఎలా కాపాడుకుంటారని ఎద్దేవా చేశారు. గేల్లు శ్రీనివాస్ గెలిచిన తరువాత హుజూరాబాద్ కు వచ్చి ఇచ్చిన హామీలు పూర్తయ్యే విధంగా పని చేస్తున్నామని హామీ ఇచ్చారు హరీష్ రావు. ఈటల రాజేందర్ మాట్లాడే మాటల్లో నీతి నిజాయితీ ఉందా హుజూరాబాద్ ప్రజలు అలోచించాలని కోరారు. టీఆరెఎస్ పార్టీ రోజురోజకీ హుజూరాబాద్ లో ఆదరణ పెరుగుతుందన్నారు. ఈటల రాజేందర్ మోసానికి గేల్లు శ్రీనివాస్ విశ్వసనీయతకు మధ్యలో జరుగుతున్న పోటీ..ఈ ఉప ఎన్నిక అని చెప్పారు.