హృదయవిదారకంగా ఉక్రెయిన్… బాంబు పేలుళ్ల మధ్య జాతీయ గీతం పాడుతున్న మహిళ వీడియో వైరల్

-

పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా ఉంది ఉక్రెయిన్ పరిస్థితి.. అత్యంత బలవంతమైన రష్యా ఏకపక్షంగా దాడులకు తెగబడింది. మరోవైపు ఉక్రెయిన్ సైనికులు, ప్రజలు వెన్నుచూపకుండా… రష్యాకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. అంతకు ముందు కేవలం మిలిటరీ యాక్షన్ అని చెప్పిన రష్యా… యుద్ధం చేస్తోంది. ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ.. ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించే ప్రయత్నం చేస్తోెంది. 

ఎంతో అందమైన దేశం రష్యా దాడిలో తీవ్ర అవస్థలు పడుతోంది. కీవ్, ఖర్గేవ్ వంటి పట్టణాల్లో నిత్యం బాంబుల మోత మోగుతోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రాజధాని కీవ్ నగరం ప్రస్తుతం శ్మశాన నిశబ్ధాన్ని తలపిస్తోంది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు లక్ష్యంగా రష్యన్ ఆర్మీ మిస్సైల్ దాడులకు తెగబడుతోంది. 

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లోని కొన్ని ఫోటోలు, వీడియోలు ప్రపంచానికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్ గా మారింది. బాంబు దాడులతో దెబ్బతిన్న తన ఇంటిలో పగిలిపోయిన గ్లాసును క్లీన్ చేస్తూ.. ఉక్రెయిన్ జాతీయగీతం పాడుతున్న ఓ మహిళ వీడియో ప్రపంచం చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. తన ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉబికి వచ్చే దు:ఖంతో జాతీయ గీతాన్ని ఆలపించింది. ఒక్సానా గులెంకో అనే మహిళ తన బాంబు దాడి నుండి గాజు ముక్కలను శుభ్రం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించడం ఈ వీడియోలో చూడవచ్చు. వీడియో చివర్లో లాంగ్ లివ్ ఉక్రెయిన్ అంటూ ఆ మహిళ నినాదం చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news