పుతిన్‌ను అరెస్టు చేస్తే యుద్ధమే.. నాటో, ఐరోపా కూటమికి రష్యా వార్నింగ్

-

నాటో, ఐరోపా కూటమికి మరోసారి రష్యా వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) వారెంట్‌తో ఏ దేశమైనా తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే వారిపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించింది. తమ దేశంలోకి అడుగుపెడితే రష్యా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుంటామని ఇటీవల జర్మనీ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో గురువారం రష్యా భద్రతా మండలి ఉపకార్యదర్శి దిమిత్రి మెద్వ్‌దెవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘పుతిన్‌ను అరెస్టు చేయాలన్న ఊహ ఎప్పటికీ ఊహలాగే ఉండిపోతుంది. అది నిజమవుతుందనే అనుకుందాం.  పుతిన్‌ జర్మనీకి వెళ్లినప్పుడు ఆయణ్ను అక్కడ అరెస్టు చేశారనుకుందాం. అది రష్యా సమాఖ్యపై యుద్ధం ప్రకటించడమే. తక్షణమే మా క్షిపణులు, మిగతా ఆయుధాలన్నీ జర్మనీ ఛాన్సలర్‌ కార్యాలయంవైపు దూసుకుపోతాయి’’ అని మెద్వ్‌దెవ్‌ తెలిపారు. అణుముప్పు తొలగిపోయిందా అన్న ప్రశ్నకు ‘‘ఎక్కడా తగ్గలేదు. ఉక్రెయిన్‌కు వాళ్లు (పాశ్చాత్య దేశాలు) ఆయుధాలు పంపిస్తున్న కొద్దీ ఈ ముప్పు తీవ్రత పెరుగుతూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news