అప్పుడే పుట్టిన శిశువుకు కూడ ఆధార్‌.. ఇలా నమోదు చేయండి

-

యూఐడీఏఐ అప్పుడే పుట్టిన శిశువుకు కూడా ఆధార్‌ పొందే సౌలభ్యం కల్పించింది. పుట్టిన మొదటి రోజే శిశువుకు ఆధార్‌ తీసుకోవచ్చు ఎలా అంటే ..

దీనికి శిశువు జనన ధ్రవీకరణ పత్రం అవసరం. ఆ పత్రాన్ని ఆస్పత్రి నుంచి పొందవచ్చు. తల్లి లేదా తండ్రి ఆధార్‌ కూడా అవసరం. కొన్ని ఆస్పత్రులు తమ ఆధార్‌ దరఖాస్తు సేవలను కూడా అందిస్తున్నాయి.
శిశువు బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఆధార్‌ కార్డుకు నమోదు చేయడానికి వీలుపడదు. పల్లలకు 5 ఏళ్ల వరకు ఎలాంటి ఫింగర్‌ ప్రింట్‌ తీసుకోరు. ఆ తర్వాత వివరాలను ఆప్‌ డేట్‌ చేసుకోవచ్చని యూఐడీఏఐ ఈ వివరాలను ట్వీట్టర్‌లో తెలిపింది.

సాధారణంగా ఏ ప్రభుత్వ పథకానికి అర్హత కావాలన్న ఆధార్‌ తప్పనిసరి చేశాయి. బ్యాంకు ఖాతా, విద్యాసంస్థలు, చివరికి వాహనానం కొనాలన్నా ఆధార్‌ తప్పనిసరి. మనం మొదటిసారి చిన్న పిల్లలకు ఆధార్‌ తీసుకునేది పాఠశాలలో చేర్పించినపుడు, స్కూలు యాజమాన్యం ఆధార్‌ వివరాలు నమోదు చేసుకోమని సదరు విద్యార్థి తల్లిదండ్రులకు సూచిస్తారు. అలాకాకుండా పుట్టిన మొదటిరోజు నుంచే ఆధార్‌ నమోదుకు శ్రీకారం చుట్టింది యూఐడీఏఐ.

నమోదు వివరాలు

మొదట httpl://uidai.gov.in-aadhaar/get-aadhaar లింక్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు పత్రంపై క్లిక్‌ చేసి పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతనరం తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ అడ్రస్‌ నమోదు చేయాలి. శిశువు పేరును దరఖాస్తు పత్రంలో నింపాలి. అన్ని వివారలు నమో దు చేసిన తర్వాత మీకు సమీపంలో ఉండే ఆధార్‌ సెంటర్‌కు అక్కడ సంబంధిత ఆధార్‌ సెంటర్‌ సిబ్బందికి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ అపాయింట్‌మెంట్‌ తేదీ లభిస్తుంది. ఇచ్చిన తేదీ, సమయానికి ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి నమోదు చేసుకోవాలి. కావాల్సిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాల ధ్రువీకరణ∙అనంతరం ఆధార్‌ కార్డును జారీ చేస్తారు. ఈ విధంగా మీ చిన్నారికి కూడా ఆధార్‌ కు దరఖాస్తు చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news