ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.దీంతో వైసీపీ పార్టీ ఒక్కసారిగా అంతర్మథంలో పడిపోయింది. ఈ మేరకు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు.
వైసీపీ ఓటమిపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్, అధికారులు తమ మాట విని ఉంటే గెలిచేవాళ్లమని కాటసాని వ్యాఖ్యానించారు. వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ కారణమని తెలిపారు. 10 రోజుల్లోనే సీన్ మొత్తం మారిపోయిందని కాటసాని వ్యాఖ్యానించారు. రైతుల భూములు లాక్కుంటామని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిందని తెలిపారు. ఇసుక పాలసీ కూటమి కూడా వైసీపీకి నష్టం చేసిందని ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి అన్నారు.