జనవరి 9 నుంచి SA 20 సీజన్-3 ప్రారంభం

-

దక్షిణాఫ్రికాలో నిర్వహించే SA20 లీగ్ మూడో సీజన్ తేదీలు వెల్లడయ్యాయి. 2025 జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన రెండు సీజన్లలోనూ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్గా నిలిచింది. సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఓనర్ కావ్య మారన్ ఈ జట్టుకు కూడా యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి.

ఇదిలా ఉంటే… దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన టీ20 లీగ్ రెండో సీజన్ ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించి దక్షిణాఆఫ్రికా టీ20 లీగ్ 2024 ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది.89 రన్స్ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్.

Read more RELATED
Recommended to you

Latest news