24 నుండి 36 గంటల్లో కాబూల్ ఎయిర్ పోర్ట్ గేట్ వద్ద మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వెల్లడించారు. దాంతో కాబూల్ ప్రజలు మరియు ఆఫ్గనిస్తాన్ ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ వరుస బాంబు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడులలో మొత్తం 180 మరణించారు.
మరికొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాంబు దాడుల్లో చనిపోయినవారిలో అమెరికా సైనికులు మరియు తాలిబన్లు కూడా ఉన్నారు. ఇక ఆఫ్గనిస్తాన్ లో దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా డ్రోన్ దాడులను ప్రారంభించింది. మరికొన్ని దాడులకు కూడా పాల్పడతామని తమ సైనికులను చంపిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని బైడెన్ హెచ్చరించారు.