ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు ముగ్గురు కార్యకర్తల ప్రాణాలు తీశాయి. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరిడికొండ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించ బోయి స్కార్పియో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల స్వస్థలం వెల్దుర్తిగా పోలీసులు గుర్తించారు.
ఎమ్మెల్యే శ్రీదేవి బర్త్‌డేను పురస్కరించుకుని కార్యకర్తలు పత్తికొండలో భారీ ఏర్పాట్లు చేశారు నాలుగు స్తంభాల సర్కిల్లో శ్రీదేవి కేక్ కట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత చేపట్టిన బైక్ ర్యాలీ ఈ ప్రమాదానికి కారణమైందని అంటున్నారు. ఈ ర్యాలీలో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. బాణాసంచా పేలుడులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వేడుకల కారణంగా వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు . శ్రీదేవి బర్త్డే వేడుకల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం పది మంది ఆసుపత్రి పాలనపై విమర్శలు వెల్లువెత్తాయి. పుట్టినరోజు వేడుకలు ఉత్సవాలు జాతర్ల నిర్మించుకోవాలని పోవడం వల్లే ఇదంతా జరిగిందని జనాలు మండిపడుతున్నారు.