పార్టీ మారినా ఆ ఎమ్మెల్యేకు ఫలితం దక్కలేదా…!

-

ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్లు మంత్రులు అయ్యారు. ముఖ్యమంత్రులు కూడ అయ్యారు. కాని ఈయనకేమిటి ఇలా జరుగుతుంది. ఆనియోజవకర్గం నుంచి అదికూడ ప్రతిపక్ష పార్టీ నుంచి మూడు సార్లు వరుసగా గెలిచాడు. ఎపుడు గెలిచిన ప్రతిపక్షంలో ఉండటంతో…ఇక లాభం లేదనుకుని ఈసారి గెలవగానే అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. కానీ సీన్ తిరగేస్తే మంత్రి పదవి ఏమోకాని…పొలిటికల్ కెరీయర్ కి ఇబ్బందిగా మారిన కేసు నుంచి కూడా విముక్తి లభించలేదు…

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్నప్పటికి ఆయనకు మాత్రం ఓటుకు నోటు కేసు మాత్రం వదలడం లేదంట. ప్రతిపక్షంలో నాలుగు సార్లు ఎంఎల్ఎ గా గెలిచిన వ్యక్తి కూడ. అది కూడ ప్రతిపక్షంలో గెలుపొందడం ఆయన కు కార్యకర్తలపై ఉన్న పట్టును కూడ నిరూపిస్తుంది . ఎస్ఎఫ్ఐ నాయకుడిగా రాజకీయ క్యారిర్ ప్రారంబించిన సండ్ర సిపిఎం నుంచి పాలేరు నియోజకవర్గంలో ఒక్క సారి గెలుపొందాడు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో బాగంగా పాలేరు జనరల్ కావడంతో.. సత్తుపల్లి ఎస్ సి నియోజకవర్గంగా మారింది. దీంతో సత్తుపల్లి నుంచి టిడిపి పార్టీ నుంచి మూడుసార్లు వరుస వెంట గెలుపొందాడు.

వరుస గెలుపులతో ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో మంత్రి పదవి ఇస్తామని చెప్పి అధికార పార్టీ లోకి గుంజేసుకున్నారంట. అయితేనేమి ఆయన అనుకున్నది మాత్రం నెరవేర లేదంట.అది హేమా హేమీలు పోటీ పడ్డ నియోజకవర్గం కూడ . అక్కడ నుంచి జలగం వెంగళరావు గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. తుమ్మల నాగేశ్వరరావు రెండు దశబ్దాల పాటు మంత్రిగా సత్తుపల్లి నుంచి ఉన్నప్పటికి ఆయన కూడ మూడు సార్లు వరుస వెంట గెలుపొందలేదు. మరి జలగం ప్రసాద రావు కూడ మంత్రిగా చేసిన ఆయనకు అదే చరిత్ర.. అక్కడ నుంచి జలగం వెంకట్రావు కూడ గెలుపొందాడు. అయితే ఒక్క జలగం వెంగళరావు కు తప్ప మరెవ్వరికి వరుస గా మూడు సార్లు గెలుపొందిన చరిత్ర లేదు. కాని ఎవ్వరికి లేని చరిత్ర ఒక్క సండ్ర వెంకటవీరయ్యకు లభించింది.

అలా మొన్న టిడిపి నుంచి గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య.. ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే అధికార పార్టీ తీర్దం పుచ్చేసుకున్నాడు. మంత్రి పదవి వస్తుందని మాత్రమే ఆయన అధికార పార్ఠీలో చేరాడు. మంత్రి పదవి ఏమో కాని.. ఆయన మీద ఉన్న ఓటుకు నోటు కేసునే తొలగించుకోలేక పోతున్నాడంట.. టిడిపి లో ఉన్నప్పుడు ఎంఎల్ సి ఎన్నికల్లో అదికార టిఆర్ఎస్ ను దెబ్బ తీసేందుకు టిడిపి చేసిన ప్రయత్నం బెడిసికొట్టగా ఓటు కు నోటు కేసులో ఇరుక్కున్నారు.

అయితే ఈ కేసు గత వారం రోజుల నుంచి మళ్లీ చర్చగా మారిపోయింది. గత వారం రోజుల నుంచి ఓటు కు నోటు కేసు తెర మీదకు వచ్చింది. ఈకేసులో తనను తొలగించాలని సండ్ర వెంకటవీరయ్య లేఖ రాసినప్పటికి ఎసిబి మాత్రం దానిని తిరస్కరించింది. మరి ఎందుకో ఏమో కాని.. ఈ కేసు ఆయనకు ఇబ్బందులను కొని తెచ్చి పెడుతుందంట. ఓటు కు నోటు కేసు పోతే తనకు మంత్రి పదవి ఖాయమన్న నమ్మకం లో సండ్ర ఉన్నప్పటికి ఆ కేసు మాత్రం ఆయనకి కొరకరాని కొయ్యగా మారిందట.

Read more RELATED
Recommended to you

Latest news