చెప్పుతో కొట్టాలి.. అల్లు అర్జున్ పై తెలంగాణ గాయకుడు షాకింగ్ కామెంట్స్

-

పుష్ప సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది. యావత్ దేశాన్ని పుష్ప మ్యానరిజం మెస్మరైజ్ చేసింది. పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ‘తగ్గేది లే’ అంటూ రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇండియన్ క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా పుష్ప శ్రీవల్లి స్టెప్పులతో, తగ్గేది లేదు అంటూ హడావుడి చేస్తున్నారు.

అయితే పుష్ప సినిమాలో ఓ స్మగ్లర్ ని హీరోగా చిత్రీకరించడమేంటనే వాదన కూడా ఉంది. ఇటీవల ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి కూడా పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో, డైరెక్టర్ ని కడిగిపారేస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు.

తాజాగా టీఆర్ఎస్ నేత ప్రముఖ తెలంగాణ గాయకుడు సాయి చంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పుష్ప సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హౌలేగాళ్లను తగ్గేదే లేదు అంటూ హీరోలు చేసిన తర్వాత పిలగాళ్లను కంట్రోల్ చేసుడు కష్టమైందని.. ఈ సినిమాలను తీసే ఎదవలను చెప్పుతో కొట్టాలి ఫస్ట్ అంటూ ఫైర్ అయ్యారు

 

Read more RELATED
Recommended to you

Latest news