ఏపీలో పీఆర్సీ విషయం రోజురోజుకు జఠిలమవుతోంది. ఉద్యోగులు ప్రభుత్వంపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. పీఆర్సీ విషయంలో మాతో బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్దమా… ఉద్యోగ సంఘ నేతల సవాల్ విసిరారు. చర్చల్లో ఏం చెప్పడం లేదు.. ఛాయ్ బిస్కెట్టులు పెట్టి పంపుతున్నారని..చర్చల్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి కదా..? మేం సమ్మెకి వెళ్తే జీతాల డబ్బులని మిగుల్చుకోవచ్చనేది ప్రభుత్వ కుట్ర చేస్తోందని.. ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు అన్నారు. ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం అని సీఎస్ సమీర్ శర్మ అనడం చాలా బాధాకరమని…మా జీతాన్ని కూడా అప్పుగానే భావిస్తారా..? పీఆర్సీకి డీఏలకు ఏమైనా సంబంధం ఉందా..? అంటూ మరో నేత వెంట్రామి రెడ్డి అన్నారు. ఐఆర్ కు సీఎస్ సమీర్ శర్మ కొత్త భాష్యం చెప్పారని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ఎద్దేవా చేశారు. ఐఆర్ అంటే ఇంట్రస్ట్ ఫ్రీ లోన్ అని ఏ డిక్షనరీలో చెప్పారో అర్ధం కావడం లేదని…ఐఆర్ అంటే మధ్యంతర ఉపశమనం అని డిక్షనరీల్లో ఉందని ఆయన అన్నారు. ఉపశమనం కింద ఇచ్చిన డబ్బులను రికవరీ ఎలా చేస్తారో అర్దం కావడం లేదని.. గత ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోల్లో ఐఆర్ నుంచి రికవరీ చేయమని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు.