SDT15 : సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గ్లింప్స్ రిలీజ్ కి డేట్ ఫిక్స్

-

SDT15 : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే తన కెరీర్ లో 15వ సినిమా మంచి ప్రతిష్టాత్మకంగా మారగా, ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు కార్తీక్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుండగా మేకర్స్ అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు రివిల్ చేశారు.

ఈ చిత్రం నుంచి ఈ డిసెంబర్ 7న టైటిల్ గ్లింప్స్ నీ అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ ఆసక్తికర పోస్టర్ తో అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రం ప్రపంచంలోకి తీసుకెళతాం అన్నట్టుగా ఓ కాగడ పట్టుకొని సాయి ధరమ్ తేజ్ చేయి ఇందులో కనిపిస్తోంది. మరి ఇదంతా చూస్తుంటే ఈ చిత్రం ఓ అడ్వెంచర్ డ్రామాల అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news