బిగ్ షాక్.. హైపర్ ఆది పెళ్లి ఫోటోలు వైరల్..!!

-

బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి షో లలో జబర్దస్త్ షో కూడ ఒకటి. ఈ షోలో ఎంతోమంది కమెడియన్లు సినిమాలలో ఒకవైపు బుల్లితెరపై అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, హైపర్ ఆది , రాంప్రసాద్, గెటప్ శ్రీను తదితర కమెడియన్స్ సైతం బాగా పేరు సంపాదించారు. ఇక బుల్లితెరపై సుధీర్, రష్మీ జంట ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వీరిద్దరూ వెండితెరపై, బుల్లితెరపై బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ తదితర కామెడీ షోలతో హైపర్ ఆది కమెడియన్ గా పేరు సంపాదించారు.

ముఖ్యంగా తను వేసే పంచ్ డైలాగులు సైతం ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నాయి. ఈమధ్య హైపర్ ఆది కొన్నాళ్లు జబర్దస్త్ కి దూరమయ్యారని వార్తలు వినిపించాయి. అయితే టిఆర్పి రేటింగ్ తగ్గడంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. హైపర్ ఆది స్కిట్లు కూడా యూట్యూబ్లో మంచి వ్యూస్ ని రాబడుతూ ఉన్నాయి. ఇటీవల జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా వచ్చిన సౌమ్యారావు కనడ అమ్మాయి అయినప్పటికీ హైపర్ ఆది అమెకు కూడ చుక్కలు చూపిస్తున్నారు.. ఇక గతంలో కూడా రష్మీ, అనసూయ పైన సెటైర్లు వేస్తూ ఉండే హైపర్ ఆది సౌమ్యాను కూడా తమ పంచు డైలాగులతో ఆకట్టుకుంటున్నారు.

అయితే ఇప్పుడు హైపర్ ఆదికి సంబంధించి కొన్ని పెళ్లి ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో హైపర్ ఆది రహస్యంగా వివాహం జరిగిందా అంటు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. కేవలం ఒక సినిమాలోని సన్నివేశంలోని భాగంగానే హైపర్ ఆది సీరియల్ యాక్టర్ ఇలా పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు గెటప్ లో కనిపించినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news