Republic Trailer : మెగా సాయి ధరమ్ తేజ్, దేవ కట్టాల కాంబినేషన్‌లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కినున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఈ చిత్ర దర్శకుడు దేవకట్టా.. గతంలో ప్రస్థానం లాంటి చిత్రాలు తీసి విమర్శకుల ప్రశంసలు పొందాడు. అలాగే.. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్స్ అన్ని ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడులైంది. విడుదల చేసిన కొద్ది సేపటికే మెగా అభిమానులు రెచ్చిపోయారు. కోట్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. విడుదలైన 15గంటల్లోనే 3.8 మిలియన్ వ్యూస్ కుపైగా సొంతం చేసుకుంది. యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో నంబర్ వన్ పొజిషన్‌లో దూసుకపోతుంది. ఇక ఈ ట్రైలర్ చూసిన నెటిజన్స్ మాత్రం తెగ పొగడుతున్నారు.
ఈ చిత్రంలో రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్, రమ్యకృష్ణ మధ్య సీన్లు చూస్తుంటే… రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఉత్కంఠభరితంగా, వల్లు చలిజరించేలా ఉన్నాయి ప్రతి డైలాగ్. ‘అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్’ అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ప్రభుత్వ అధికారులపై రాజకీయ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూపించారు. ఇందులో తేజు కలెక్టర్‌గా కనిపించనున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఈ చిత్రం తేజు సిని కెరీర్ లో మైల్ స్టోన్ గా మిగిలిపోతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు.