అలాంటివంటే అసహ్యం అంటున్న సాయి పల్లవి..!

-

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. న్యాచురాలిటీగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మరింత మెప్పించింది. విల్లులా తన శరీరాన్ని వంచుతూ మరింతగా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సెలెక్టివ్ పాత్రలు మాత్రమే చేస్తూ గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటున్న సాయి పల్లవికి ప్రస్తుతం అవకాశాలు పెద్దగా రావడం లేదని చెప్పవచ్చు. ఇకపోతే దక్షిణాదిలో కథానాయికగా ఉన్నత స్థానానికి చేరుకుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈమె మొదట టీవీ ఛానల్ లో డాన్స్ పోటీలో పాల్గొనడం ద్వారానే సినిమా అవకాశాలను దక్కించుకుంది అని.. అయితే ఇప్పుడు ఈమె అలాంటి డాన్స్ పోటీలనే విమర్శిస్తోంది.

అలాంటి పోటీలపై తనకు నమ్మకం లేదు అని తెలిపింది సాయి పల్లవి. గతంలో తమిళంలో విజయ్ టీవీలో ప్రసారమైన ఉంగళిల్ యారు అడత్తు ప్రభుదేవా.. (మీలో ఎవరు తదుపరి ప్రభుదేవా) అనే డాన్స్ పోటీల కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి ఆ పోటీల్లో రెండవ స్థానానికి మాత్రమే పరిమితం అయింది. దీంతో ఆ బాధని తట్టుకోలేక ప్రథమ బహుమతి గెలుచుకోవడానికి కారణం ధన బలం అంటూ తన అక్కసుకు వెళ్లగక్కింది. దీని గురించి ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ.. డాన్స్ పోటీల్లో ప్రతిభకు ఎప్పుడు గౌరవం లేదు అని కూడా తెలిపింది. చాలా టీవీ చానల్స్ లో డబ్బుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని, లేకపోతే ప్రముఖుల వారసులకు అలాంటి మర్యాద ఇస్తారని, అందుకే తనకు డాన్స్ పోటీలు అంటే నమ్మకం లేదు అని, అలాంటివంటే అసహ్యం అంటూ తెలిపింది. ఇదిలా ఉండగా ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ధనుష్ తో కలసి మారి 2 చిత్రంలో రౌడీ బేబీ పాటలో నటించింది. ఈ పాటతో ఈమె ధనుష్ తోపాటు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news