దేవుడు దయతో రెండేళ్ల క్రితం జ‌గ‌న్‌ సీఎం అయ్యారు : స‌జ్జ‌ల

జ‌గ‌న్ పుట్టిన రోజు నేప‌థ్యంలో…వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. లక్షలాది మంది ఆశిస్సులు, దేవుడు దయతో రెండేళ్ల క్రితం సీఎం అయ్యారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్ అభిమానులు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారని.. తన తండ్రి అకాల మరణం తర్వాత పోరాట బాట లో జగన్ అడుగు పెట్టారన్నారు. రాజన్న బిడ్డగా కోట్లాది మంది జగన్ ను అక్కున చేర్చుకున్నారని… ఇవాళ ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా పాలన సాగిస్తున్నారన్నారు.

ప్రతి ఇంట్లో కనిపిస్తున్న చిరునవ్వే దీనికి సాక్ష్యమ‌ని.. పేద వర్గాల పిల్లలు కూడా విశ్వ మానవులుగా ఎదిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని వెల్ల‌డించారు. గ్రామ స్వరాజ్యాన్ని మాటల్లో నుంచి ఆచరణలోకి తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ OTS అనే చక్కటి పథకాన్ని రూపొందించారని… OTSపథకం అందరికీ ఉపయోగకరమైందని వెల్ల‌డించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే డబ్బులు కట్టకుండా OTS పథకాన్ని అమలు చేస్తాను అంటున్నారన్నారు. గత ఐదేళ్ల పరిపాలనలో OTS గురించి ఎందుకు ఆలోచించలేదు…? ఎందుకు అమలు చేయలేదు…? అని ప్ర‌శ్నించారు.