ఫిలిప్పీన్స్ లో ’రాయ్‘ తుఫాన్ విధ్వంసం… 375 మంది మరణం…

ఫిలిఫ్పీన్స్ లో రాయ్ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. తుఫాన్ ధాటికి ఆదేశం అతలాకుతలం అయింది. చాలా మంది ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఫిలిప్పీన్స్ లో 375 మంది మరణించారని.. మరో 56 మంది ఆచూకీ లభించలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈనెల 15 తేదీన రాయ్ తుఫాన్ ఆగ్నేయాసియా దేశం అయిన ఫిలిప్పీన్స్ దేశ తీరాన్ని తాకింది. ముఖ్యంగా విసాయాస్ మరియు ఈశాన్య మిండనావో ద్వీపంలోని కరగా ప్రాంతంలో అత్యధిక మరణాలు సంభవించాయి.

ఇదిలా ఉంటే  దేశంలోని చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా లక్షలాధి మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతంలోని ఉళ్లు తుడిచిపెట్టుకపోయాయి. లక్షలాధి చెట్లు నెలమట్టం అయ్యాయి. గత కొన్ని ఏళ్లుగా ఇలాంటి తుఫానును చూడలేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఫిలిప్పీన్స్ లో దాదాపుగా 442,424 మంది నివాసితులను నిరాశ్రయులయ్యారు.