రాజీనామా చేస్తే ఏమొస్తుంది..? సందు దొరికినప్పుడల్లా చేయమనడం కరెక్ట్ కాదు !

-

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జగన్ లేఖ రాశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును లాభాల బాట పట్టించే ప్రత్యామ్నాయాలను సూచించారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిదంతా చేస్తామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రభుత్వ రంగంలో ఉంచేలా ప్రయత్నాలు చేస్తూనే.. మరో వైవు మరో స్టీల్ ప్లాంట్ తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

విశాఖ స్టీల్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనే విషయం గుర్తుంచుకోవాలని, ప్లాంటుని రివైవ్ చేయడానికి ప్రభుత్వం సూచనలు చేయొచ్చని అన్నారు. నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో కొత్తేం ఉంది ? అని ప్రశ్నించిన ఆయన 10-15 శాతం ఓట్లు కూడా రాని వారు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని రాజీనామా చేస్తే ఏమొస్తుంది..? పోటీ చేసి మళ్లీ గెలుస్తామని అన్నారు. దీన్ని రాజకీయాలు చేయడం సరి కాదు.. అందరి సహకారం కావాలని, ఛాలెంజ్ లు చేయడం.. దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news