ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల లక్ష్యం 2024 ఎన్నికల్లో గెలవడమే. ఒకవైపు వైసీపీ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తుంటే, టీడీపీ – జనసేన – బీజేపీలు కలిసి వైసీపీ అధికారాన్ని లాగేసుకోవాలని చూస్తున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ చేసిన ఒక మహత్తర కార్యాన్ని గురించి ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేశారు. ఈయన మీడియా ముఖంగా సజ్జల మాట్లాడుతూ… గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి లో కేవలం ధనవంతులు ఉండాలని దుర్మార్గపు ఆలోచన చేశారు. కాగా రైతుల ముసుగులో అమరావతిలో భూములను కొన్నది అంతా సంపన్నులే అని ఈ సందర్భంగా సజ్జల గుర్తు చేశారు. ప్రజలు క్షేమం కోరే మన సీఎం జగన్ మాత్రం పేదలకు కూడా అమరావతిలో ఉండడానికి అర్హులు అని భావించి ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని ప్రభుత్వం గురించి కొనియాడారు.
ఇక ఎన్నికలకు కేవలం కొంతకాలమే ఉన్నందున అందరూ ఓటర్లను ఆకట్టుకోవడానికి అష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మరోసారి జగన్ కు ప్రజలు అవకాశం ఇస్తారా ? అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.