జ‌గ‌న్ పాల‌న‌కు  ఏడాది పూర్తి :  మేనిఫెస్టోకే తొలి ప్రాధాన్యం

-

ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యింది. గ‌త ఏడాది అప్ర‌తిహ‌త విజ‌యాన్ని సొంతం చేసుకున్న వైసీపీ 151 మంది ఎమ్మెల్యేల భారీ బ‌లంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. గ‌త ఏడాది మేలో సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మే నెల వ‌చ్చింది. అంటే ఏడాది పూర్త‌యింది. తాను ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న ఒక మాట చెప్పారు. క‌నీసం ఆరు మాసాలు త‌న‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని, మంచి ముఖ్య‌మంత్రి అనిపించుకుంటాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో నే ఆయ‌న మ‌రో ఆస‌క్తికర విష‌యాన్ని కూడా ప్ర‌జ‌ల‌ముందు ఉంచారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు కొన్ని హామీల‌ను వెల్ల‌డిస్తూ.. వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ మేనిఫెస్టో వెలువ రించారు. కేవ‌లం నాలుగు పేజీల‌తో, కీల‌క అంశాల‌తో ఆయ‌న ఈ మేనిఫెస్టోను ఎన్నిక‌ల‌కు ముందు విడుద‌ల చేశారు. అంతేకాదు, తాను అధికారంలోకి వ‌స్తే.. దీనిని ప్రామాణికంగా చేసుకునే ముందుకు సాగుతాన‌ని చెప్పారు. అన్న‌ట్టుగానే ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక‌.. దానినే దిక్సూచిగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్ర‌భుత్వ కార్యాయాల్లో వైసీపీ మేనిఫెస్టో ఖ‌చ్చితంగా క‌నిపించేలా ఏర్పాటు చేశారు. ఈ మేనిఫెస్టోలోని ప్ర‌తి అంశాన్ని ప‌రిపూర్ణంగా అమ‌లు చేసేలా చ‌ర్యలు తీసుకుంటున్నారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు చూస్తే..

  • రైతులకు ఉచితంగా బోర్లు.. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు
  • రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
  •  రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
  • ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయికే విద్యుత్
  • రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
  • రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
  • రైతులకు సున్నా వడ్డీకే రుణాలు
  • వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
  • అన్ని రకాల వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
  • ప్రభుత్వ ఆస్పత్రుల దశా దిశా మార్చడం
  • కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
  • వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు
  • పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
  • అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు
  • మూడు దశల్లో మద్యపాన నిషేధం
  • ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ
  • ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం
  • శ్రీవారి సన్నిధిలో తలుపులు తీసే అవకాశం గొల్లలకు కల్పించడంఇక ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లికానుక కింద రూ.లక్ష.. బీసీ అమ్మాయిలకు రూ.50వేలు ఆర్థిక సాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్‌కు రూ.2వేల కోట్లు కేటాయిస్తామ‌న్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు. అర్చకులకు రిటైర్మెంట్ విధానం రద్దు చేసి.. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి.. ఇళ్ల నిర్మాణం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను బడికి పంపిస్తే చాలు ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15,000. 45సంవత్సరాలు నిండిన ప్రతీ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత రూ.75 వేలు వారికి అందించడం.ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు.. ఇల్ల స్థలాలు లేని పేదలకు వారి పేరు మీదే ఇంటి స్థలం కొని రిజిస్ట్రేషన్ చేస్తా. పోలవరం, వెలిగొండ వంటి పథకాలను పూర్తి చేయడం. చెరువులను పునరుద్దరించి.. రక్షిత మంచినీరు అందిచడం. ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటంతో పాటూహోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం. గ్రామ సచివాలయం ఏర్పాటు ద్వారా అదే గ్రామానికి చెందిన 10మందికి ఉద్యోగాలు. ప్రతి గ్రామంలో 50ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్, గ్రామ వాలంటీర్‌ను నియమించి నెలకు రూ.5వేలు అందించడం. గ్రామ సచివాలయంతో వారి పనిని అనుసంధానం చేస్తారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును వారు పర్యవేక్షిస్తారు. ఇలా ఏదైతే చెప్పారో.. వీటిలో సింహ‌భాగం తొలి ఏడాదిలోనే అందునా క‌రోనా ఎఫెక్ట్‌తో రెండు మాసాలుగా ప‌నులు జ‌ర‌గ‌క‌పోయినా జ‌గ‌న్ త‌న మేనిఫెస్టో అమ‌లుకే ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news