Salaar Teaser : సలార్ టీజర్ వచ్చేసింది..

-

కెజిఎఫ్ చాప్టర్ 1 మరియు 2 ల అనంతరం డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది అని చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా ఆఫర్ లు కూడా భారీగానే వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “సలార్”. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నుండి వచ్చే ఒక్కో అప్డేట్ అభిమానులను మరింత ఆసక్తిని రేపుతోంది.

అయితే.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా టీజర్ వచ్చేసింది. ప్రభాస్ మాస్ లుక్, బిజిఎం, ఎలివేషన్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రశాంత్ నీల్ మరోసారి ఇండస్ట్రీని షేక్ చేస్తారని, ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడతారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news