సలాం.. మేజర్ మోహిత్ శర్మ..!

-

మేజర్ మోహిత్ శర్మ.. 19978 జనవరి 13వ తేదీన హర్యానాలోని రోహ్ తక్ గ్రామంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్, సుశీల. మేజర్ మోహిత్ శర్మను అతని తల్లిదండ్రులు ‘చింటు’ అని స్నేహితులు ‘మైక్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. కాలేజ్ లైఫ్ లోనే గిటార్, సింథసైజర్ వాయించడం నేర్చుకున్నాడు. ప్రతి విషయాన్ని సవాల్ గా తీసుకుని ఆ పనిలో నైపుణ్యం సాధించేవాడు. ఢిల్లీలోని మానవ్ స్టాలీ స్కూల్ లైఫ్ పూర్తి చేశాడు. మహారాష్ట్రలోని షెగావ్ లోని శ్రీసంత్ గజనన్ మహరాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు.

mohith sharma

ఇంజినీరింగ్ లో జాయిన్ అయిన తర్వాతే మోహిత్ కు ఆర్మీలో చేరాలని కోరిక పుట్టింది. దీంతో ఇంజినీరింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి 1995లో నేషనల్ ఢిపెన్స్ అకాడమిలో జాయిన్ అయ్యాడు. అతి తక్కువ సమయంలోనే ఉత్తమ క్యాడట్లలో ఒకడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. కల్నల్ భవానీ సింగ్ మార్గదర్శకత్వంలో హార్స్ రైడింగ్ లో శిక్షణ పొందాడు. బాక్సింగ్, ఈతలోనూ ఆరితేరారు. ఆ తర్వాత బెటాలియన్ క్యాడెట్ అడ్జంటెంట్ (బీసీఏ)లో ర్యాంకు సాధించారు.

మొదటి పోస్టింగ్..

ఐఎంఏలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత.. భారత ప్రభుత్వం అతడి మొదటి పోస్టింగ్ ను హైదరాబాద్ లో వేసింది. హైదరాబాద్ నుంచి మోహిత్ కాశ్మీర్ లో 38 సార్లు ఆర్ఆర్ (రాష్ట్రీయ రైఫిల్స్) లో దేశానికి సేవ చేయడానికి వెళ్లాడు. 2002లో నిర్వహించిన ఆపరేషన్లలో భాగంగా శౌర్య పథకం (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ ప్రశంస పతకం) అందుకున్నాడు.

పారా కమాండోలో చేరిక..

మోహిత్ కు మొదటి నుంచే పారా కమాండో ఫోర్స్ లో చేరాలని ఆశ ఎక్కువ. 2003లో భారత సైన్యంలోని పారా(ఎస్ఎఫ్)-1 లో చేరాడు. కశ్మీర్ లో విధులు కూడా నిర్వహించాడు. 2004లో అతనికి సేన మెడ్ (శౌర్య) అవార్డు లభించింది. ఆ తర్వాత 2005 నుంచి 2006 వరకు బెల్గాంలోని కమాండో వింగ్ బోధకుడిగా పని చేశాడు. ఆ తర్వాత తిరిగి కశ్మీర్ లోని సహన్ విధులకు బయలు దేరాడు. కుపవారా జిల్లాలో ఉగ్రవాద దాడి జరిగింది. అప్పుడు మేజర్ మోహత్ భద్రత దళానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదులు మూడు దిశల నుంచి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ యుద్ధంలో మోహిత్ నలుగు ఉగ్రవాదులను చంపాడు. ఇద్దరు సహచరుల ప్రాణాలు నిలిపి అమరుడయ్యాడు. అతని మరణాంతం భారత ప్రభుత్వం మోహిత్ శర్మకు అశోక చక్ర ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news