2022లో వేతన పెంపు.. అయిదేళ్ల గరిష్టానికి చేరుకునే అవకాశం..!

-

రతదేశంలో వేతన పెంపు ఈ ఏడాది ఐదేళ్ల గరిష్టం 9.9 శాతం కి చేరుకోవచ్చని నివేదిక ద్వారా తెలుస్తోంది. 2021 లో చూస్తే అది 9.3 శాతంగా వుంది. నివేదిక ఆయన్ సర్వే ప్రకారం ఈ విషయాలు బయటపడ్డాయి. ఆర్థిక రికవరీ పుంజుకోవడం, సానుకూల వ్యాపార సెంటిమెంటు తో కంపెనీలు కొత్త తరం సామర్థ్యాలను నిర్మించాలని అనుకుంటున్నాయి.

అధిక పెట్టుబడులు పెట్టి ముందుకు రావడంతో వేతన పెంపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. వెంచర్ క్యాపిటల్, ఐటి, ఈ కామర్స్, లైఫ్ సైన్స్ రంగాలలో అధిక వేతన పెంపు ఉండవచ్చని తెలుస్తోంది. మొత్తం 1500 కంపెనీలు అలానే 40 కి పైగా ఇండస్ట్రీల ద్వారా సర్వే చేశారు.

దీంతో వేతనం పెరగవచ్చని తెలుస్తోంది. జీతాలు పెరగడం వల్ల ఉద్యోగులకు ఊరట కలుగుతుంది. టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకి ప్రస్తుతం మరియు భవిష్యత్తులో కూడా శాలరీ పెంచేటట్టే కనబడుతోంది.

2018 నుండి 2021 మధ్యకాలంలో చూసుకున్నట్లయితే శాలరీ పెంపు 17 శాతంగా ఉండగా సాఫ్ట్వేర్ డెవలపర్, కన్సల్టెంట్, డేటా సైన్స్ రంగం లో 12 శాతం వరకు ఉన్నట్లు తేలింది. 2022 లో బ్రెజిల్లో చూసుకున్నట్లయితే శాలరీ ఇంక్రిమెంట్ 5.3% ఉండగా, రష్యా 6.1, చైనా 6.0 శాతం ఉన్నట్లు సర్వే ద్వారా తెలిసింది. భారతదేశంలో వేతన పెంపు ఈ ఏడాది ఐదేళ్ల గరిష్టం 9.9 శాతం కి చేరుకోవచ్చని నివేదిక ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news