ఎమ్మెల్యే కన్నబాబుకు టోకరా.. నకిలీ పత్రాలతో భూమి అమ్మకం

ఈ మధ్యకాలంలో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏదో రూపంలో… డబ్బు కాజేయాలని.. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. అయితే ఘరానా మోసం లో…. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా… అందరికీ టోకరా ఇస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు కొందరు కేటుగాళ్లు టోకరా వేశారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజు కు దొంగ పత్రాలతో భూమి అమ్మేశారు ఈ ఘరానా మోసగాడు.

ఏకంగా 12 ఎకరాల 26 సెంట్ల భూమిని కోట్ల రూపాయలుకు అమ్మారు మోసాగాళ్లు. అయితే ఈ భూమి వివాదంపై… యలమంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు భూమి అసలు యజమాని. యజమాని ఫిర్యాదుతో… ఈ భూమి గుట్టు బయట పడింది.

ఇక భూమి అమ్మిన యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి…భూమి అమ్మిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆ నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ప్రకటన చేశారు పోలీసులు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కన్నబాబు… షాక్ కు గురయ్యారు.