ఆ మహిళా ప్రధానికి ప్రపంచం సెల్యూట్ చేస్తుంది…!

-

కరోనా వైరస్ విషయంలో న్యూజిలాండ్ ని ఏ దేశం అయినా మెచ్చుకోవాల్సిందే. ఒక్క కేసు కూడా లేకుండా దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేసారు ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెన్‌. 38 ఏళ్ళ ఈ మహిళా ప్రధాని తీసుకున్న ప్రతీ నిర్ణయం కూడా సంచలనమే. ఆమె ప్రతీ నిర్ణయం కూడా చాలా వేగంగా ఆలోచించి తీసుకున్నారు. ఒకసారి కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఒక కేఫ్ కి వెళ్ళారు. ఆ కేఫ్ లో ఖాళీ లేదు.

నిర్వాహకులు ఆమెను కరోనా కారణంగా ఖాళీ లేదు అని వెనక్కు పంపించారు. సాధారణంగా మరొకరు అయితే కేఫ్ ని తీసేయిస్తారు. ఎందుకంటే ప్రధాని కదా… కాని తప్పు నాదే నేనే సీట్ బుక్ చేసుకోలేదు అని చెప్పి అక్కడి నుంచి వెనక్కు వచ్చారు. ఆ సంఘటన ఆ దేశంలో ఒక సంచలనం. ప్రపంచ దేశాలు కూడా షాక్ అయ్యాయి. ఇక కరోనా విషయానికి వస్తే సామాజిక దూరం, అలాగే కరోనా వైద్యం, బాధితుల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు,

ప్రజల నుంచి ఆమె తీసుకున్న సహాయ సహకారాలు అన్నీ కూడా ఒక సంచలనమే. ఫలితంగా ఆమె కరోనా నిబంధనలు పాటించడమే కాకుండా అందరిని పాటించే విధంగా చేసారు. ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించడమే కాదు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం వాటిని సమర్ధవంతంగా అమలు చేయడంతో దేశంలో కరోనా అనేది లేకుండా చేసారు ఆమె. ఇప్పుడు కరోనా లేని దేశం న్యూజిలాండ్ ఒక్కటే.

Read more RELATED
Recommended to you

Latest news