చైనాను చుట్టుముట్టిన మరో విప‌త్తు.. ?

-

ఒకవైపు ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే.. ఇదే సమయంలో మనదేశంలో వర్షాలు పడటం మొదలైయ్యాయి.. దీని ప్రభావంతో ఈ వైరస్ మరింతగా బలాన్ని పుంజుకుని విసృతంగా వ్యాపించడం మొదలు పెట్టింది.. ఇక కరోనాకు పుట్టిళ్లు అయినా చైనాలో ఈ వైరస్ ప్రభావం తగ్గి ఇప్పుడిప్పుడే అక్కడి ప్రజలు ఊపిరి తీసుకుంటున్న సమయంలో మరో విపత్తు వచ్చిపడింది.. కన్నెర్ర చేసిన ప్రకృతి తన ప్రతాపాన్ని చైనా పై చూపిస్తుందట.. ఇక ప్రకృతికి విరుద్దంగా నడుచుకునే వారెవరైనా సరే ఏదో ఒకరోజు దాని ఫలితాన్ని అనుభవించవలసిందే.. ఇప్పుడు చైనా వంతు వచ్చిందని అందరు అనుకుంటున్నారు..

ఇక విషయం ఏంటంటే.. దక్షిణ చైనాలో కురుస్తున్న‌‌ భారీ వర్షాల వల్ల పొంగుతున్న వరద ఉధృతికి మట్టిపెళ్ల‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌ల‌లో లక్షలాది మంది నిరాశ్రయులవగా, వేలాది ఇళ్లు నీట మునిగిపోయాయట.. ఇకపోతే ఈ వరదల కారణంగా సుమారుగా 24 మందికి పైగా ప్ర‌జ‌లు మృతి చెందగా, లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్ళవలసి వచ్చింద‌ని చైనా ప్రభుత్వం పేర్కొంది.

 

ఈ క్రమంలో నిరాశ్ర‌యులైన 2.30 లక్షల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌రలించామ‌ని చైనా అత్యవసర సేవల విభాగం తెలిపింది. ఇక గత వారం రోజులుగా దక్షిణ చైనాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఇక్కడ ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లోని 110 నదులు పొంగి పొర్లుతూ వర‌ద‌లు సంభ‌విస్తున్నాయి.. మొత్తానికి ఈ సంవత్సరం అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్న విషయం సృష్టంగా అర్ధం అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news