సమంత ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ సోమవారం గ్రాండ్‌గా జరిగింది. చాలా కాలం తర్వాత సామ్ లైమ్‌లైట్‌లోకి రావడం చూసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి సామ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంతపై సామాజిక మాధ్యమాల్లో ఓ పేజీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
ట్విటర్‌కు చెందిన బజ్ బాస్కెట్ అనే ఓ పేజీ సమంత ఫొటోలతో ఓ క్యాఫ్షన్ ఇమేజ్ను షేర్ చేసింది. “సమంతను చుస్తుంటే బాధనిపిస్తోంది. ఆమె తన అందాన్ని కోల్పోయింది. విడాకుల నుంచి బయటపడ్డ ఆమె.. సినీ కెరీర్లో టాప్‌లో ఉన్న టైమ్‌లో.. మయోసైటిస్ వ్యాధి బారిన పడిమరింత బలహీనురాలయ్యింది” అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
ఈ పోస్టు సామ్ కంట పడటంతో తను స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. “నేను తీసుకున్న విధంగా మీరు నెలల తరబడి చికిత్స తీసుకోకూడదని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. అయితే యశోద మూవీ సమయంలో ‘మయోసిటిస్’ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ఓ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే.
I pray you never have to go through months of treatment and medication like I did ..
And here’s some love from me to add to your glow 🤍 https://t.co/DmKpRSUc1a— Samantha (@Samanthaprabhu2) January 9, 2023