Samantha: బ‌ర్త్ డే పార్టీలో స‌మంత సంద‌డి.. మీరే నిజ‌మైన స్నేహితులు అంటూ ఎమోష‌న‌ల్!

-

Samantha: టాలీవుడ్‌ బ్యూటీపుల్ హీరోయిన్‌ సమంత విడాకుల బాధలో నుంచి బయటపడేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితురాలతో కలిసి తీర్థయాత్రలు చేస్తోంది. స‌న్నిహితుల‌తో సరదాగా విదేశాలు చుట్టి వస్తూ పలు పార్టీలు అటెండ్ అవుతోంది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాను ఏం చెప్పాలనుకున్నా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే వెల్లడిస్తున్నారు. ఇక స‌మంత త‌న‌ బాధను, భావోద్వేగాలను సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సమంతా త‌న స్నేహితురాలు డాక్టర్ మంజుల పుట్టిన రోజు వేడుక‌ల్లో సంద‌డి చేసింది. ఈ పార్టీలో దర్శకురాలు నందిని రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి పార్టీలో పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది. ఈ పార్టీలో స‌మంత సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. డిజైనర్ జోనాథన్ సింఖాయ్ రూపొందించిన డ్రెస్ వేసుకుని అద్భుతమైన రూపంతో ఆకర్షించింది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసింది. డాక్టర్ మంజుల అనగాని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మీలాంటి స్నేహితురాలు దొర‌క‌డం నా అదృష్టంగా భావిస్తున్నానని, క‌ష్ట కాలంలో ధైర్యంగా నిల్చున్నార‌నీ, మీ కంటే నిజమైన స్నేహితుల్లేరంటూ రాసుకోచ్చింది. ఇక విడాకుల తర్వాత సామ్‌ రెండు కొత్త చిత్రాలకు ఓకే చెప్పింది. త్వరలోనే వీటికి సంబంధించిన షూటింగ్స్‌లోనూ పాల్గొననుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Read more RELATED
Recommended to you

Latest news