కరోనా లాక్ డౌన్ వేళ ఎంతో మందికి చేయూతనిచ్చి మానవత్వాన్ని చాటుకున్నాడు సినీనటుడు సోనూసూద్. సొంత డబ్బులతో ప్రజలను స్వస్థలాకు పంపించాడు. ఇదే విధంగా నిస్సాహయులుగా ఉన్న వారికి ఆర్థికంగా అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్న పేదలకు వైద్య ఖర్చుల కోసం నిస్వార్థంగా ఆర్థిక సహాయం చేశారు. అయితే తాజాగా సోనూసూద్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
’సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారనే భయంతోనే ఈడీ, ఐటీ దాడులు చేశారని వ్యాఖ్యానించారు‘. ఎవరైనా మొదటగా సహాయం చేయడానికి ముందుకు వస్తే కేవలం పేరు, ప్రఖ్యాతల కోసమే ఇదాంతా చేస్తున్నారని అంటారు.. ఇది దాటిన తర్వాత వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. ’ఆయన కష్టంతో ఆయన ఏదో చేసుకుంటుంటే.. ప్రజలకు సేవలు చేద్ధాం అని చూస్తుంటే ఆయన మీద దాడులు చేస్తున్నారని విమర్శించారు. సోనూ సూద్ వెంట మేం అండగా ఉంటామని, మీరు భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన కోవిడ్-19 వారియర్స్ సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వంటి నాయకులు ఉంటే మాలాంటి వాళ్ల అవసరం కూడా ఉండదని సోనూసూద్ అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సహాయం చేసినా.. దేశంలో ఒక్క తెలంగాణలోనే అభినందించే వ్యవస్థ తారసపడిందని సోనూ సూద్ అన్నారు.