దెయ్యంలా మారనున్న హీరోయిన్ సమంత ?

-

టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతోంది. ఇకపోతే తాను ప్రేమించిన నాగచైతన్యను వివాహం చేసుకొని ఆ తరువాత విడాకులు తీసుకుంది. ఇక విడాకుల తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా పడి లేచిన కెరటంలా వరుస అవకాశాలు అందుకుంటూ తన సినీ కెరియర్లో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇది ఇలా ఉండగా… సమంత త్వరలోనే బాలీవుడ్‌ దర్శకుడు అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా ఆయూష్మాన్‌ ఖురానా కాగా ఇందులో సమంత రెండు పాత్రలు చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఒక పాత్ర రాజ్‌ పుత్‌ రాణిగా ఉంటుందని.. మరో పాత్ర దెయ్యంగా ఉంటుందని టాక్‌. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసుకుంటుందని.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కానుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news