టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఇక అందులో అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ భార్య స్నేహ రెడ్డికి అత్తగారు నిర్మల పెళ్లయ్యాక ఒక కండిషన్ పెట్టారట. పెట్టిన కండిషన్ నిన్ స్నేహ రెడ్డి ఫాలో అయ్యిందా లేదా అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ తో మొదటి చూపులోనే బన్నీతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక ఫంక్షన్ లో కలిసిన స్నేహారెడ్డి, అల్లు అర్జున్ ప్రేమికులుగా మారారు. ఫోన్ నెంబర్స్ మార్చుకొని చాలా ఎక్కువగా మాట్లాడుకునేవారు. ఇక పెళ్లి విషయంలో మాత్రం అడ్డంకులు ఏర్పడ్డాయి. హైదరాబాదులో విద్యాసంస్థలు నడుపుతున్న శేఖర్ రెడ్డి కూతురు స్నేహారెడ్డి. ఇక అల్లు అర్జున్తో స్నేహా రెడ్డి వివాహానికి శేఖర్ రెడ్డి ఒప్పుకోలేదు. సినిమా వాళ్లు కావడంతో ఆయన అభద్రతాభావం ఫీల్ అయ్యారు. ఇక స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి అడిగినా కూడా పిల్లను ఇవ్వనన్నాడట. అయితే స్నేహ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ తో ప్రేమ విషయంలో ఫుల్ సీరియస్ గా ఉన్నారట. కూతురి ప్రేమను అర్థం చేసుకున్న శేఖర్ రెడ్డి 2011 మార్చిలో వీరి వివాహాన్ని జరిపించారు.

పెళ్లి జరిగాక అల్లు అర్జున్ తల్లి నిర్మల కోడలు స్నేహ రెడ్డికి ఒక కండిషన్ పెట్టారట. పిల్లల విషయంలో తనకు మాట ఇవ్వాలని కూడా అన్నారట. వీలైనంత త్వరగా మనవడో, మనవరాలినో కని పెట్టాలని గట్టిగా చెప్పారట. మోడ్రన్ సొసైటీలో పుట్టి పెరిగిన స్నేహ రెడ్డి పెళ్లైన వెంటనే పిల్లలను కనడానికి ఇష్టపడదని అల్లు అర్జున్ తల్లి నిర్మల భయపడ్డారు. కానీ అత్త కోరికను నెరవేరుస్తూ 2014లో అబ్బాయి అయాన్ కి జన్మనిచ్చారు. 2016లో అమ్మాయి అర్హ కు జన్మనిచ్చారు.అల్లు అర్హ శాకుంతలం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే.