హీరోయిన్‌ రంభకు తృటిలో తప్పిన ప్రమాదం.. కారుకు యాక్సిడెంట్‌!

-

టాలీవుడ్‌ అలనాటి హీరోయిన్‌ రంభకు పెను ప్రమాదమే తప్పింది.రంభకు, ఆమె ఫ్యామిలీకి ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో రంభ ఫ్యామిలీ కి గాయాలయ్యాయి. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో తన ఫ్యామిలీకి అందరికీ గాయాలయ్యాయని రంభ వాపోయింది. అయితే అవన్నీ చిన్న గాయాలేనని, కానీ తన కూతురు సాష మాత్రం ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉందని చెబుతూ ఎమోషనల్ అయింది.

ఈ మేరకు రంభ చేసిన పోస్ట్ మీద అందరూ స్పందిస్తున్నారు. స్కూల్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా, ఇంకోకారు అనుకోకుండా తమ కారును ఢీ కొట్టిందని, ఈ ప్రమాదంలో అందరికీ చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కానీ నా కూతురు సాష మాత్రం ఇంకా హాస్పిటల్ లోనే ఉంది. తను త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి. మాకు ఈ రోజు టైం ఏం బాగాలేదు. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్, ఈ సమయంలో మీ ప్రార్థనలో మాకు ఎంతో ముఖ్యమైనవి అంటూ రంభ వేడుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news